EE Jeevana Tharangalalo Lyrics in Telugu- GhantaSala, Shobhan babu, Vanisree

ee jeevana Thanrangaalalo Lyrics - Ghantasala


ee jeevana Thanrangaalalo
Singer Ghantasala
Composer Acharya Athreya
Music J.V.Raghavalu
Song WriterAcharya Athreya

Lyrics

This song is from Movie "Jeevana Tharangaalu".Starring Shobhanbabu, Gummadi,Vani Sree, Krishnam Raju.This movie is from Suresh Productions and produced by RamaNaidu.



ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో


పది మాసాలు మోశావు పిల్లలను

బ్రతులంతా మోశావు బాధలను

ఇన్ని మోసిన నిన్ను మోసే వాళ్ళు లేక వెళుతున్నావు


ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో

ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము


కడుపుచించుకు పుట్టిందొకరు.. కాటికి నిన్ను మోసేదొకరు..

తలకు కొరివి పెట్టేదొకరు.. ఆపై నీతో వచ్చేదెవరు....ఆపై నీతో వచ్చేదెవరు


ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో

ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము


మమతే మనిషికి బందిఖానా.. భయపడి తెంచుకు పారిపొ్యినా

తెలియని పాశం వెంటపడి.. రుణం తీర్చుకోమంటుందీ..

తెలియని పాశం వెంటపడి.. రుణం తీర్చుకోమంటుందీ

నీ భుజం మార్చుకోమంటుంది!


ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో

ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము


తాళి కట్టిన మగడు లేడని.. తరలించుకుపోయే మృత్యువాగదు

ఈకట్టెను కట్టెలు కాల్చక మానవు.. ఆ కన్నీళ్ళకు చితి మంటలారవు...

ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు!


ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో

ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము




ee jeevana Thanrangaalalo Watch Video

Comments

  1. "I really enjoyed reading your post! It's wonderful to see such insightful content about Telugu music. You’ve captured the essence of Song Lyrics Telugu so beautifully—there’s so much emotion in every line. Keep up the great work!"

    ReplyDelete

Post a Comment