Manasu Gathi Inthe Lyrics in Telugu-ANR,Vanisree, Ghantasala

Manasu Gathi Inthe Lyrics - Ghantasala


Manasu Gathi Inthe
Singer Ghantasala
Composer Acharya Aatreya
Music K.V.Mahadevan
Song WriterAcharya Aatreya

Lyrics

Manasu Gathi Inthe  Song from "Prema Nagar" movie on Suresh Productions. Starring ANR and VaniSree in lead roles. Directed by KS Prakash Rao. Music by KV Mahadevan. Produced by Ramanaidu.



 



మనసు గతి ఇంతే పాట తెలుగులో 



తాగితే మరచిపోగలను - తాగనివ్వదు

మరచిపోతే తాగగలను - మరువనివ్వదు

ఉహ్.హ్.హ్.హ్.



మనసు గతి ఇంతే - మనిషి బ్రతుకింతే

మనసున్న మనిషికీ సుఖము లేదంతే

మనసు గతి ఇంతే


ఒకరికిస్తే మరలిరాదు - ఓడిపోతే మరచిపోదు (మళ్ళీ)

గాయమైతే మాసిపోదు - పగిలిపోతే అతుకు పడదు

మనసు గతి ఇంతే - మనిషి బ్రతుకింతే

మనసు గతి ఇంతే




అంతా మట్టేనని తెలుసు - అదీ ఒక మాయేనని తెలుసు ||2||

తెలిసీ వలచీ విలపించుటలో.. హ..హ్హ..హ్హ...

తీయదనం ఎవరికి తెలుసు..



మనసు గతి ఇంతే - మనిషి బ్రతుకింతే

మనసు గతి ఇంతే


మరుజన్మ ఉన్నదోలేదో - ఈ మమతలప్పుడేమౌతాయో (మళ్ళీ)

మనిషికి మనసే తీరని శిక్షా.. హ.హ్హ..హ్హ..హ్హ (నవ్వు)

దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా..


మనసు గతి ఇంతే - మనిషి బ్రతుకింతే

మనసున్న మనిషికీ సుఖము లేదంతే

మనసు గతి ఇంతే




Manasu Gathi Inthe Watch Video

Comments